ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికీ ఘన నివాళులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు, ఆంద్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పోరాట స్పూర్తిని, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ రావు, బి.ఎన్.విజయకుమార్, ఎపి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, పిడిసీసీ బ్యాంక్ చైర్మన్ డా కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు మార్కెటింగ్ యార్డు చైర్మన్ శ్రీ వెంకటరావులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం కోసం త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి పంతులు గారని, వారి త్యాగాలను స్పూర్తిగా తీసుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారు ప్రకాశం జిల్లా వినోద రాయుని పాలెం లో జన్మించడం, జాతికి చేసిన సేవలకు గుర్తుగా వారి పేరున ప్రకాశం జిల్లా ఏర్పడం జరిగిందన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారన్నారు. ఆంద్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పోరాట స్పూర్తిని, త్యాగాలను ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, ఒంగోలు ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, మెప్మా పిడి శ్రీమతి విజయలక్ష్మి, తహసీల్దార్ మధుసూదన్ రావు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి మునిమనవడు సంతోష్ కుమార్, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

