ఎండలు వడగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కంభం తాసిల్దార్.


 ఎండలు వడగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కంభం తాసిల్దార్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

రాష్ట్ర ప్రభుత్వం మరియు మార్కాపురం జిల్లా కలెక్టరు ఎం విజయ సునీత గారి ఆదేశాల మేరకు, రాబోవు వారం రోజులు జిల్లాలో తీవ్రమైన ఎండలు, వడగాలుల రావచ్చు అని వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, కంభం మండలం లోని ప్రజలు అప్రవత్తంగా ఉండాలని తెలియజేయడమైంది. వడగాలులు ఎక్కువగా ఉన్నందున అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలియజేస్తున్నాం. బయటికి వెళ్లేవారు తలకు రుమాలు టోపీలు పెట్టుకుని బయటకు వెళ్లాలి అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నవని, రానున్న వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల వద్దనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కంభం తాసిల్దార్ వి.కిరణ్ కుమార్ తెలియజేసారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post