ఆత్మహత్యల సంగతి మీ దృష్టికి వచ్చిందా.
టీడీపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చింనాయుడుకు శవాలు విసిరిన వైసీపీ పట్టణ అధ్యక్షులు శిస్తు గోపి.
క్రైమ్9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
శ్రీకాకుళం. పలాస(మే:07)
ఒకే రోజు, ఒకటే జిల్లా లో ముగ్గురు రైతుల ఆత్మహత్యలపై శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణ అధ్యక్షులు శిస్టు గోపి ఈ సందర్బంగా విలేకరుల తో మాట్లాడుతూ..అనంతపురం జిల్లాలో రాప్తాడు మండలం, చాపట్ల గ్రామానికి చెందిన కౌలు రైతు తలారి.నరసింహులు, రాయదుర్గం రూరల్ ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి(32), పామిడి మండలం నీలూరు గ్రామానికి చెందిన బెల్లం.నాగేంద్ర రెడ్డి అనే ముగ్గురు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఒకే రోజు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అన్నారు.
వేల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చే కూటమి ప్రభుత్వం రైతులకు మాత్రం వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవడం ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని
99 పైసలకే భూములు పారిశ్రామికవేత్తలకు ఇస్తాం అని గట్టిగా చెప్పే నారా లోకేష్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం గురించి మాట్లాడరన్నారు.
ఇక చంద్రబాబుకి రైతులు అంటేనే గిట్టదు.వ్యవసాయం దండుగ అని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం లేనప్పుడు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయలు తన సొంత డబ్బులు ఇస్తున్నా అంటూ హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక చనిపోయిన ఒక్క కౌలు రైతుకు కూడా పరిహారం ఇవ్వకపోవడం ఆయన చేస్తున్న మోసపూరిత రాజకీయాలకు నిదర్శనం అన్నారు
రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని
జగన్ ప్రభుత్వంలో ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు కుటుంబానికి 7 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేవారు.... వెంటనే ఆ ఎక్స్ గ్రేషియా 10 లక్షల రూపాయలకు పెంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
