గోపాల సాగరం సుందరీకరణకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.



 గోపాల సాగరం సుందరీకరణకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

 క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

ఈరోజు పలాస నియోజకవర్గం మందస మండలం మందస గ్రామంలో గల గోపాలసాగరం నకు WDC-PMKSY 2.0 ప్రాజెక్ట్ (Watershed) లో భాగంగా గోపాలసాగరం చెరువు సుందరీకరణ పనులకు పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష శంకుస్థాపన చేశారు.

ఈ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ద్వారా రూ.36 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి అందుబాటు, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గోపాలసాగరం చెరువు సుందరీకరణ పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పలాస నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలోమందస మండల అధ్యక్ష కార్యదర్శులు, మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు నీటి సంఘాల నాయకులు ఆయా అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post