ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేసిన ఘంటా సాయి కృష్ణకు జూన్ 3 వరకు రిమాండ్.


ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేసిన ఘంటా సాయి కృష్ణకు జూన్ 3 వరకు రిమాండ్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం  గ్రామానికి చెందిన ఘంటా సాయి కృష్ణపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీ మోసం కేసు నమోదైంది. అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అమాయక నిరుద్యోగుల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

తన తమ్ముడు అమెరికాలో ఉన్నాడని చెప్పి విదేశీ ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి డబ్బులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘంటా సాయి కృష్ణను అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, సత్తెనపల్లి కోర్టు అతనికి జూన్ 3 వరకు రిమాండ్ విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post