విద్యార్థినిల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించిన కలెక్టర్. Llp


 విద్యార్థినిల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించిన కలెక్టర్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

పదో తరగతి పరీక్ష ఫలితాలలో కంభం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని షేక్ రజియా సుల్తానా 582/600 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా ఈరోజు ఒంగోలు ప్రకాశం భవనంలోని పీఎస్ఆర్ హాల్ నందు జరిగిన సమావేశంలో రజియా సుల్తానా వారి తల్లిదండ్రులను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి రేణుక.అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి. కంభం మండల విద్యాశాఖ అధికారి 2 టి శ్రీనివాసులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి అమూల్య గారి సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృషి పట్టుదల క్రమశిక్షణ తో కూడిన విద్యాభ్యాసంతో దేనినైనా సాధించ వచ్చు అని షేక్ రజియా సుల్తాన నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిల తల్లిదండ్రులు.ఉపాధ్యాయులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post