గ్యాస్ సిలిండర్లు పేలి పూరి గుడిసె దగ్ధం ఆస్తి నష్టం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొలానికి వెళ్తున్న సమయంలో ఇంటి యజమాని గ్యాస్ స్టవ్ వెలిగించిన సమయంలో పూరి గుడిసెలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. పేలుడు ధాటికి మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఇంటిలోని వస్తువులు, రెండు లక్షల రూపాయలు నగదు, మూడు తులాల బంగారం పూర్తిగా కాలి దగ్ధమయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది చేరుకునేలోపే పూరి గుడిసె కావడంతో మంటలు వేగంగా వ్యాపించి పూర్తిగా కాలిపోయింది.
