ఘనంగా జయంతి వేడుకలు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహ స్థాపనకై బహుజన పరిరక్షణ సమితి నాయకులు దాసరి యోబు ఆధ్వర్యంలో ముందుగా భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు. మరియు ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి. గోన చెన్నకేశవులు. కొత్తపల్లి శ్రీనివాసులు. తోట శ్రీనివాసులు. మాజీ సైనికుల నాయకులు అంకయ్య గౌడ్. రంగనాయకులు పుల్లయ్య. ఎన్జీవోస్. ఆదిములపు లూకా అనిల్ రాజ్. నంది నాగయ్య. ఎన్ ప్రభుదాస్. బహుజన నాయకులు తురక శేఖర్. వేముల రాజు. పి.ప్రసాద్ తదితరులు పాల్గొని భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు.
అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలేగారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కిక్ కట్ చేసి తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ భారత ప్రథమ సామాజిక తత్వ వేత్త బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని అలాగే మహిళా విద్యకు ఎంతో పాటుపడడాని ఆయన అన్నారు. ఎస్సీ సెల్ నాయకులు కోన చెన్నకేశవులు మాట్లాడుతూ అంటరాని కుల నిర్మూలన తో పాటు మహిళా ఉద్ధరణకు ఎంతో కృషి చేశాడని అలాగే సత్యశోధక్ సొసైటీని ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతకై పాడుపడిన వ్యక్తి మన మహాత్మ జ్యోతిరావు పూలే అని తెలిపారు. లూకా అనిల్ రాజు మాట్లాడుతూ ఆరోజు కుల వ్యవస్థ పై పోరాడిన వ్యక్తి బహుజనులకు విద్య మహిళలకు విద్య సమానత్వం కావాలని అలాగే చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకొని ఆమెను భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహానీయుడు మన మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బాలికల కోసం మొట్ట మొదట 1848లో పాఠశాలను స్థాపించి వితంతువులకు ఒక గృహాన్ని స్థాపించారు భారతీయ బాలికల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఈ జయంతి వేడుకలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.



