కంభం పరిధిలో NH-544D పై ప్రత్యేక డ్రైవ్ – అనధికార ఎల్ఈడి లైట్ల తొలగింపు.




కంభం పరిధిలో NH-544D పై ప్రత్యేక డ్రైవ్ – అనధికార ఎల్ఈడి లైట్ల తొలగింపు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివరామ కృష్ణ పరిధిలోని నేషనల్ హైవే నంబర్ -544D రహదారిపై ట్రావెల్స్ బస్సులు మరియు వాహనాలలో అమర్చిన అనధికార ఎల్ఈడి లైట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ డ్రైవ్ సందర్భంగా వాహనాలను సమగ్రంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్ ఈ డి లైట్లను అక్కడికక్కడే తొలగించి ధ్వంసం చేశారు.

అధికారులు డ్రైవర్లకు ట్రాఫిక్ మరియు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనే సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక కాంతి వెలువరించే లైట్ల వినియోగాన్ని నివారించాలని హెచ్చరించారు.

ఈ చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు రహదారి భద్రతను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post