స్వయ జనగణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరుశాసనసభ్యులు.


 స్వయ జనగణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరుశాసనసభ్యులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొని తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. 

ఈ స్వీయ నమోదు విధానం ద్వారా సులభంగా, పారదర్శకంగా జనగణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని, దేశ అభివృద్ధి కార్యక్రమాలకు ఇది పునాది అవుతుందని ఆయన సూచించారు.

 జనగణనలో నమోదు చేసిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణబాబు, ఏఎస్ఓ ఎండి ఫరీదా సుల్తానా బేగం, టౌన్ ప్లానింగ్ అధికారి రాజరెడ్డి, విఆర్ఓ రంగయ్య ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post