స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,ఆదేశాల మేరకు ఎఆర్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమం నిర్వహించారు.
ఎఆర్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని అందువలన మనసు ప్రశాంతతతో కూడి ఆరోగ్యకర వాతావరణంలో, క్రమశిక్షణగా విధులు నిర్వర్తించొచ్చు. మన చుట్టూ ఉంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. నీరు జీవానికి అత్యంత ముఖ్యమైన వనరని, ప్రతి చుక్కను వృథా కాకుండా మితంగా వినియోగించాలని, చెట్లు నాటడం ద్వారా నీటి నిల్వలు పెరుగుతాయని తెలిపారు.
నీరు లేకపోతే జీవం అసాధ్యమన్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు.స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, (SASA) ప్రతిజ్ఞ చేయించారు.


