పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ విద్యార్థులకు కీలక సూచనలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా పామూరు బుధవారo ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ, ద్వితీయ
పరీక్షల్లో ఫెయిల్ అయినా నిరుత్సాహపడకూడదని, ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోవడం పిరికితనం అన్నారు. గెలుపు-ఓటములు సహజమని, ఓటమితో కృంగిపోకుండా మళ్లీ పట్టుదలతో ప్రయత్నించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని కష్టపడి చదివి మంచి భవిష్యత్తు సాధించాలని సీఐ వినోద్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాసైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
