పవన్ కళ్యాణ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట - రెడ్డి అప్పలనాయుడు.
24 వ స్థానం నుంచి అగ్రస్థానానికి ఏపీ.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో గణనీయమైన పురోగతి.
గత వైసిపి ప్రభుత్వం లో కేంద్ర పథకాలు నిర్వీర్యం.
జగన్ రెడ్డికి పేర్లు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి తప్ప పాలించడం చేతకాదు.
పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి సరిపోరు.
పవన్ కళ్యాణ్ ముందుచూపు ఆలోచనలు, పనితీరు అత్యుత్తమైనవి.
పవన్ కళ్యాణ్ లాంటి సరైన నాయకుడిని ఎన్నుకంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి - రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, ఏప్రిల్ 02. క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.:- ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జనసేన అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా 5 జాతీయ పురస్కారాలు లభించడం పట్ల ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పని తీరుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఇదే విభాగం 24 వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం అన్నారు. అలాగే తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహించే "జలసంచయ్ - జన్ భాగీదారీ" కార్యక్రమంలోనూ ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పల్లె పండుగ 1.0 , పల్లె పండుగ 2.0 వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. గ్రామసభలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా పల్లె వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడి, జాతీయ స్థాయిలో ఈ పురస్కారాలు రావడం విశేషం అన్నారు.
పంచాయతీరాజ్ శాఖకు జాతీయస్థాయిలో వచ్చిన 5 అవార్డులు జగన్ రెడ్డి కు కనిపించడం లేదా..?? పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికే బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చి, పవన్ కళ్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అయ్యా జగను రెడ్డి నువ్వు చెప్పే కాకమ్మ కబురు నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు. కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని నువ్వు ఆరోపిస్తున్నావు కదా. పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎలా పరిపాలన కొనసాగిస్తున్నారనే విషయాలను జగన్ ఒకసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ పనితీరు అర్థం అవుతుందని ఎద్దేవ చేశారు. గతంలో 24 వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ను ఒకటో స్థానానికి తీసుకువచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది. కనీసం సచివాలయానికి కూడా వెళ్లకుండా సెట్లు వేసి పరిపాలన చేసిన మీరు పవన్ కళ్యాణ్ ని అనడానికి సరిపోరు అని హెచ్చరించారు.గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, ఏ మంత్రి ఎలా ఉండేవారో కూడా తెలియని పరిస్థితి నుంచి గర్వంగా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ శాఖ అని చెప్పుకునే పనులు చేస్తున్నారు. సంస్కరణలు తెచ్చారు. గ్రామీణ వికాసానికి దారి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ పనితీరు, ముందుచూపు ఆలోచనలు అత్యుత్తమమైనవి. అవి ఆకాశం లాంటివి.. దానిమీద ఉమ్ము వేస్తే అది తిరిగి మళ్ళీ జగన్ రెడ్డి మీదనే పడుతుంది తస్మాత్ జాగ్రత్త హెచ్చరించారు.
మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి గిరి పుత్రుల బాధలను అర్థం చేసుకుంటూ, పవన్ పాలన సాగిస్తున్నారు. డోలి రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ.. అడవి తల్లి బాట పేరుతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రెస్ మీట్ అవగానే బెంగళూరు వెళ్ళిపోయే మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతారు అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి పేరు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకేమీ తేలిదు. నీకు అంతగా పిచ్చి ఉంటే మీ ఇంటికి జగన్ జంగిల్ అని పేరు పెట్టుకోండి. నీకున్న ఈ పేర్లు పిచ్చి, మీ పార్టీ రంగుల పిచ్చి, మీకు ఎప్పటికీ పోదు. వైసీపీకి ప్రజలు 11 స్థానాలే ఇచ్చినా బుద్ధి రాలేదంటే మరోసారి దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించి, అవి కూడా ఇవ్వడం వృధా అనేలా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తీర్పు ఇస్తారని వెల్లడించారు. మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, 44వ డివిజన్ కార్పోరేటర్ పొలిమేర దాసు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకిపండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బొండా రాము నాయుడు, జనసేన రవి, వాసా సాయి, కర్ర టవిటి రాజు, వేముల బాలు, కొండల ప్రసాద్, వీర మహిళలు తుమ్మపాల ఉమా దుర్గా, యడ్లపల్లి మమతా తదితరులు పాల్గొన్నారు.
.jpg)