చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బిఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
చిత్తూరు ఏప్రిల్ 2.క్రైమ్ 9మీడియా ప్రతినిధి బాబు.
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు...దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని... ఆకివీడు పెద్ద పేట దళితులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలనే... డిమాండ్ తో 2-4-2026 న గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బిఎస్పీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం పై తెలిపిన డిమాండ్లతో.. అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర కార్యదర్శి & చిత్తూరు జిల్లా ఇన్చార్జి కె, ప్రభాకర్ మాట్లాడుతూ.. అగ్రకుల మనువాద రాజకీయ పార్టీలకు మన బహుజన సమాజం అమ్ముడుపోతూ... అధికారాలు వారికి కట్టబెట్టడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. వీటన్నింటికీ పరిష్కారం బహుజనులకు రాజ్యాధికారం ఒక్కటే పరిష్కార మార్గం అన్నారు రాబోవు రోజుల్లో ప్రతి ఒక్కరు బహుజన సమాజ్ పార్టీని ఆదరించి ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదానే కొనసాగించాలని.. ఆకివీడు దళితులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి, సురేంద్రబాబు, జిల్లా ఇన్చార్జిలు బ్రాహ్మణపల్లి లోకనాథం, శివాడి గోవిందు, జిల్లా ఉపాధ్యక్షులు వై, నాగూర్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, కోశాధికారి, మద్దెల బాబు, జిల్లా మహిళా కన్వీనర్ లావణ్య, చిత్తూరు అసెంబ్లీ అధ్యక్షులు గురునాథం, జీడి నెల్లూరు అసెంబ్లీ ఇన్చార్జ్ రమేష్ బాబు, పలమనేరు అసెంబ్లీ ఇన్చార్జ్ కె, శ్రీనివాసులు, అమరనారాయణ, పూతలపట్టు అసెంబ్లీ ఉపాధ్యక్షులు హేమాద్రి, కార్యదర్శి నరసింహులు,ఐరాల మండల ఇన్చార్జ్ కలికిరి వానాద్రి, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు నవీన్, వెదురు కుప్పం మండల అధ్యక్షులు ఉంగరాల నాగేశ్వరరావు, నాయకులు మహానంది, అశోక్ కుమార్, భాస్కర్, పి ప్రకాష్, పి అఖిల్, సల్మాన్, క్రైస్తవ సంఘ పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
.jpg)
