జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ఒంగోలు,భూగర్భ జలాల పెంపే ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమాన్ని జిల్లాలో విజయ వంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కల్లెకర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు “ జలధార" కార్యక్రమం నిర్వహణ పై ఇరిగేషన్, డ్వామా, గ్రౌండ్ వాటర్, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలు, సిపిడిసిఎల్ శాఖల అధికారులు, మరియు సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులతో వర్చువల్ గా సమావేశమై దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జలధార కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా ప్రజా ఉద్యమంగా అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన "జలధార" కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. "జలధార" కార్యక్రమ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జలధార కార్యక్రమంనకు సంబంధించి పనుల గుర్తింపు, ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 20 వరకు అందుకు సంబంధించిన పనుల మంజూరు, ఏప్రిల్ 21 నుండి జూలై 9 వరకు పనుల పురోగతి, జూలై 10 నుండి జూలై 14 వరకు దీని మీద పూర్తిస్థాయిలో రిపోర్టింగ్ చేయడం జరుగుతుందని, ప్రధానంగా భూగర్భ జలాల పెంపు, సంరక్షణ, నీటి భద్రత తదితర ప్రధాన అంశంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. చెరువుల పూడికతీత పనులు, కాలువల మరమ్మతులు, నీటి సంరక్షణ చర్యలపై అవగాహన, సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి సారించేలా దిశగా ఎంపీడీఓలు, ఏపీఓలు ఏపీడీలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అలాగే తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించేలా ఉద్యాన పంటలను ప్రోత్సహించడంతో పాటు బిందు, తుంపర్ల సేద్య పరికరాల వాడకంపై కూడా క్షేత్ర స్థాయిలో రైతులకు విస్తృతం గా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాలను భాగస్వాములు చేయడంతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాలు గ్రామా స్థాయిలో విస్తృతంగా నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా లో విజయవంతం చేయడంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎంపీడిఓ లు కీలక పాత్ర పోషించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు కలెక్టరేట్ లోని విసి హాల్ నుండి జడ్పీ సీఈవో చిరంజీవి, ఇరిగేషన్, సిపిడిసిఎల్, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. లు శ్రీమతి వరలక్ష్మి, వెంకటేశ్వర రావు,అశోక్ కుమార్, వ్యవసాయ, మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ జెడి శ్రీనివాస రావు, శ్రీనివాస రావు, వెంకటేశ్వర రావు, ఉద్యాన శాఖ అధికారి గోపి చంద్ పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి ఎంపీడీఓ లు ఏపిఓలు,ఏపీడీ, సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

