నూతన మహిళా కమిటీ నియామకం.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు దాసరి యోబు ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా బహుజన పరిరక్షణ సమితి మహిళ అధ్యక్షురాలుగా పానుగంటి సలోమిని. మరియు ఉపాధ్యక్షురాలుగా తత్తూరి విక్టోరియా రాణి ఏకగ్రీవంగా ఎన్నుకోని నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దాసరి యోబు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అలాగే మహిళల అభ్యున్నతికి పాటుపడిన సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడవాలని మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేయాలని మహిళల సమస్యలపై ముందుకు నడవాలని బడుగు బలహీన వర్గాల సమస్యల పైన నిరంతరంగా పనిచేయాలని ఆయన తెలిపారు.
పానుగంటి సలోమి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు నా బాధ్యతలు అనుసరించి మహిళల సమస్య పైన స్పందించి అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని ఆమె అన్నారు. అలాగే బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లూరి సలోమి. వడ్లమూడి రాజేశ్వరి. గోన రేఖ. శ్రీ వర్ష. యద్దనపూడి రాణి దాసరి రిప్కా. జాయి. జాస్మిని. తదితరులు పాల్గొన్నారు.
