విజయవాడ నడిబొడ్డున మహిళలు కాగడాల ప్రదర్శన.
మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ కుట్ర పూరితంగా వ్యవహరించింది.
మహిళా మోర్చా ఆధ్వర్యంలో అక్రోశ ర్యాలీ.... కాగడాల ప్రదర్శన.
కాంగ్రెస్ పై నిప్పులు* *కురిపించిన... బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న.
విజయవాడ.ఏప్రిల్ 28. క్రైమ్ 9మీడియా ప్రతినిధి అనూష.
విజయవాడ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్టేడియం నుండి సీతారామపురం సెంటర్ వరకు కాగడాల ప్రదర్శన సాగింది.
విపక్షాలు పైన విరుచుకుపడుతూ నినాదాలు తో హోరెత్తించారు.
ర్యాలీ ప్రారంభం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ కారణంగా ఇవాళ మహిళా బిల్లు వీగిపోయింది అంటూ కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోశారు.
దశాబ్దాల కల నెరవేర్చే అవకాశం ఉన్నా ప్రతిపక్షాలు వెనకడుగు వేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.తీవ్రస్వరంతో విపక్షాలు పైన విరుచుకుపడుతూ ప్రసంగించారు.
విపక్షాల తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాం.అందులో భాగంగానే కాగడాల ప్రదర్శన చేపడుతున్నాం.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమి కి మహిళలు బుద్థి చెబుతారని హెచ్చరించారు.
ఎస్ వి కే పద్మజ - బీజేపీ మహిళా మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు ఆద్వర్యంలో పార్లమెంట్ లో మహిళా బిల్లును కాంగ్రెస్ వామపక్ష కూటమి వ్యతిరేకించటాన్ని నిరసిస్తూ మహిళల హక్కులపై వామపక్షాలే బాధ్యత వహించాలి మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని మహిళలను రాజకీయాలకు దూరంగాఉంచేవిధంగాచూస్తున్నాయని కేవలం ఓటు కోసమే మహిళలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ వాటి మద్దతు ఇచ్చే పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నారని 30% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళలను అవమానపరిచిందని అన్నారు.
కేవలం మహిళలను ఓట్లు వేసేందుకు ఉన్నారని వారికి ఓట్ల తోనే బుద్ధి చెబుతామని రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి మహిళల బుద్ధి చెబుతారని మహిళలను గౌరవిస్తూ నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుప్రవేశపెట్టారని మహిళలను గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే బిజెపి పార్టీ అని తెలిపారు
మహిళా ఆక్రోశ ర్యాలీ ని కాగడాల ప్రదర్శన ద్వారా నిరసన వ్యక్తం చేశారు *రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరి ,*రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పాలడుగు సుభాషిణి , *రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి చిగురుపాటి లక్ష్మీ , *రాష్ట్ర మహిళా మోర్చా కార్యాలయ కార్యదర్శి కంభంపాటి మాధవి పాలడుగు సుభాషిణి,*రాష్ట్ర మహిళా మోర్చా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శిరీష , *ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి సిహెచ్ శివ లలిత , *మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షర్మిల కథూన్ ,** మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షకీలా బేగం ,*ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు MVK పద్మజా ,*ఎన్టీఆర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రత్న కుమారి ,*ఎర్ర సునీత ,*స్వరూప రాణి ,*డాక్టర్ దుర్గా శ్రీ లక్ష్మీ , *పోలే శాంతి , *కల్లూరి శ్రీవాణి తదితర నాయకులు పాల్గొన్నారు.
