నూతన కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.


 నూతన కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు YP రంగయ్య ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ శ్రీమతి యస్. విజయ సునీత గారిని ఆమె కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

అనంతరం Y P రంగయ్య మాట్లాడుతూ నూతనంగా ఎర్పడిన మార్కాపురం జిల్లా కు మొట్టమొదటి కలెక్టర్ గా మీరు రావటం మాకెంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చేదని ఇప్పుడు మాకు ఎంతో చెరువగా మార్కాపురం లో కలెక్టరేట్ ఉండటం ఉద్యోగులలో ఒక మానసిక ఉత్తేజం నెలకొందని తమరి అధ్యక్షతన జిల్లాలో మెరుగైన సేవలు అందిస్తామని అయన తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ట్రెజరర్ జానయ్య, ఉపాధ్యక్షులు అరిగెల. వెంకటరామయ్య, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ. అజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు నాగేంద్ర, V. రామకోటేశ్వరరావు, మహబూబ్ బాషా, ch . మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post