అనకాపల్లి జిల్లా ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, మార్చి :19
తెలుగు నూతన సంవత్సర ప్రారంభ సూచికగా జరుపుకునే పరాభవ' నామ సంవత్సర ఉగాది మరియు ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.ఈ ఉగాది పర్వదినం జిల్లాలోని ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులను నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అని తెలిపారు
క్రమశిక్షణ, దాతృత్వం, పవిత్రతకు నిలువుటద్దం రంజాన్. ముస్లిం సోదర సోదరీమణులందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలి. ఈ పర్వదినం సమాజంలో శాంతి, ప్రేమ మరియు సోదరభావాన్ని మరింత పెంపొందించాలి."
అల్లాహ్ ఆశీస్సులతో మరియు ప్రకృతి దీవెనలతో జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని, పండుగలను అందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
.jpg)