ఏలూరులో విద్యార్దులే... కూలీలు.


 

ఏలూరులో విద్యార్దులే... కూలీలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

 ఏలూరు జిల్లా... ఏలూరు. మార్చి6. విద్యార్థుల చేత ప్రమాదకరమైనటువంటి ప్రదేశంలో పనులు చేయిస్తున్న అక్షర స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: పి.డి.ఎస్.యు విద్యార్థుల చేత ఈరోజు పాఠశాలలో ఉన్నటువంటి షెడ్లు ఎక్కించి పనిచేయిస్తున్నటువంటి అక్షర(అగ్రహారం) స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు పాఠశాల వద్దకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు కాకినాని మాట్లాడుతూ చదువు చెప్తారని విద్యార్థులని తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తుంటే యాజమాన్యం కూలీ వాళ్ళని పెట్టుకుని చేయించాల్సినటువంటి పనులను విద్యార్థుల చేత చేయించడం చట్టరీత్యా నేరమని నాని అన్నారు. దాదాపు పది అడుగులు పైనే ఉన్నటువంటి రేకుల షెడ్డు ఎక్కించి విద్యార్థులతో తుడిపిస్తున్న సందర్భంలో అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నాని అధికారులను ప్రశ్నించారు. ఈ ఒక పాఠశాల గతంలో కూడా ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారిందని కావున ఈ విషయం పైన సమగ్ర విచారణ జరిపి పాఠశాల యాజమాన్యం పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నాని అధికారులను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాఠశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులకు నాని తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post