ఎడ్ల పందెం పోటీలను ప్రారంభించిన కే .నాగార్జున రెడ్డి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని బండలాగుడు పోటీల్లో గిద్దలూరు వైసీపీ ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
దర్గా దగ్గర మరియు రాములవారి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం బండ పందెం పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యూత్ వింగ్ సెక్రటరీ చెన్నారెడ్డి, కంభం మండల అధ్యక్షుడు గొంగిటి చెన్నారెడ్డి, సీనియర్ నాయకులు చెగిరెడ్డి, ఓబుల్ రెడ్డి, ఎంపీటీసీలు ఆనంద్, రఫీ,కంభం ఉపసర్పంచ్ సయ్యద్ ఖాసిం, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్ భాష, సర్పంచ్ లు రసూల్ ,కోటేశ్వరరావు, యాసిన్ గ్రామ నాయకులు ఖాసిం వలి (జగన్), రావూరి రాజు,పోలిశెట్టి రమణ,పోలిశెట్టి వెంకటేశ్వర్లు, రావూరి హరిదాసు, ఆర్వీ సుబ్బయ్య వెంకట సుబ్బా రెడ్డి,నాగేంద్ర రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ప్రజలు పాల్గొని ఎడ్ల పందెం పోటీలను తిలకించారు,

