అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మూడవ విడత పంపిణీ.


 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మూడవ విడత పంపిణీ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు అన్నదాత సుఖీభవ – పి.యం. కిసాన్ 2025–26 మూడవ విడత పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ పులి . శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంపై శాసనసభ్యులు మాట్లాడుతూ. నియోజకవర్గం లోని 37,649 రైతులకు ఒక్కో రైతు కి 6000 రూపాయల చొప్పున మొత్తం అభ్యున్నతే ప్రభుత్వ 22,58,94,000 రూపాయలు జమ చేయడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడం జరుగుతుంది అని తెలిపారు రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభించి పరిశీలించి తగు సూచనలు చేశారు రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తున్నందుకు , మార్కాపురం జిల్లా ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి.నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయ డమైనది.

అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ – పీ.యం.కిసాన్ పథకం ద్వారా మూడవ విడత నిధులు విడుదల చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post