యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నిలబెట్టుకుంటున్నారు.


యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నిలబెట్టుకుంటున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

జగన్ హయాంలో సాక్షి కేలండర్ తప్ప..జాబ్ కేలండర్ విడుదల చేయలేదు.

10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదలపై యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.

 మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల యువతకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని నిరూపించిందని యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ... యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చుతున్నాయి. యువత నమ్మకానికి ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయే రాజకీయాలకు ముగింపు పలుకుతూ...హామీ ఇస్తే అమలు చేస్తాం.. చెప్పిందే చేస్తాం అనే నిబద్ధతతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి జాబ్ కేలండర్ విడుదల చేస్తామని... సాక్షి కేలండర్ విడుదల చేశారు. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన తన సామాజికి వర్గానికి, తన పార్టీ నాయకులకు పదవులు తప్ప.యువతకు ఉద్యోగాలు రాలేదు. ఐదేళ్లలో ఒక్క జాబ్ కేలండర్ కూడా విడుదల చేయకుండా యువతను జగన్ మోసం చేశారు. యువత సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలకు ఇప్పుడు స్పష్టమైన దారి కనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ విడుదలతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఉద్యోగాల విషయంలో అయోమయం కాదు.. అవకాశాల క్యాలెండర్ ఇదే. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 6.28 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడం చిన్న విషయం కాదు. ప్రభుత్వం రంగంలో 21 నెలల్లోనే 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. యువత జీవితాలను మార్చగల శక్తి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు మాత్రమే ఉంది. యువత ఆకాంక్షలను అర్థం చేసుకుని, వారి భవిష్యత్తుకు రెక్కలు తొడిగే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలుస్తోంది. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే పాలన ముగిసింది...నమ్మకం ఇచ్చి.. అవకాశం ఇచ్చి.. భవిష్యత్తు నిర్మించే పాలన మొదలైందని ఎరిక్షన్ బాబు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి గారు మరియు నాయకులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post