కంభం సచివాలయం 2 లో పునః ప్రారంభం అయిన ఆధార్ సెంటర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభంలోని సచివాలయం 2 లో ఈరోజు నూతన ఆధార్ సెంటర్ ను కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య కంభం ఎంపీడీవో కంభం డిప్యూటీ ఎంపీడీవో దేవరశెట్టి బ్రహ్మయ్య లు పునః ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పల్నాటి బోడయ్య కంభం డిప్యూటీ ఎంపీడీవో దేవరశెట్టి బ్రహ్మయ్య కంభం ఎంపీడీవో వీరభద్రచారి మాట్లాడుతూ ప్రజలు ఆధార్ సెంటర్ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం 2 కార్యదర్శి షేక్ ఖాదర్ వలి, వీఆర్వో రమణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుబ్రమణ్యం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ డి.శారద, డిజిటల్ అసిస్టెంట్ పి.సురేష్, ప్రజలు పాల్గొన్నారు.
