కూటమి నాయకుల కబ్జా కోరల్లో... ప్రభుత్వ భూమి.
ఒంపోలు పేటలో కూటమి నాయకుడు ప్రభుత్వ స్థలం కబ్జా.
పట్టించుకొని రెవిన్యూ అధికారులు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి మార్చ్:08
అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో ఒంపొలు పేట గ్రామంలో సర్వే నెంబర్ 37 లో సుమారు పది సెంటు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, కొంతం జగదీశ్వరరావు శనివారం ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేయుటకు ప్రయత్నిస్తున్నాడు, గత ప్రభుత్వంలో గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని వొంపులు పేట గ్రామస్తులు కళ్యాణ మండపం నిర్మించుటకై నిర్ణయం తీసుకున్నారు, అక్కడ ప్రభుత్వ స్థలం అని హెచ్చరిక బోర్డు కూడా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు, భూమి విలువలు రేట్లు పెరిగిపోయి, లక్షలు విలువైన స్థలాన్ని, ఆక్రమిస్తుండగా, స్థానిక ప్రజలు, కొడమంచిలి దక్షిణేశ్వరరావు స్థానిక మండల తహసిల్దారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు, ఈ కూటమి నాయకులు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నఈ కూటమి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఒంపోలు పేట గ్రామస్తులు కోరుతున్నారు.
.jpg)
.jpg)

.jpg)
