పదో తరగతి పరీక్షలకు పటిష్ట పోలీస్ బందోబస్తు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 పదో తరగతి పరీక్షలకు పటిష్ట పోలీస్ బందోబస్తు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, మార్చి :16 జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.

అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తూ ఆజ్ఞలు జారీ చేశారు. కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండటాన్ని నిషేధించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా ఫ్రిస్కింగ్ (తనిఖీలు) నిర్వహిస్తున్నారు.

పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ మరియు ప్రింటింగ్ సెంటర్లను మూసివేయించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంతో పాటు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి.

పరీక్ష ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు మరియు సమాధాన పత్రాలను నిర్ణీత కేంద్రాలకు చేరవేసేందుకు పటిష్టమైన పోలీస్ ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేశారు.

పరీక్షా సిబ్బంది మినహా అనధికార వ్యక్తులు ఎవరూ కేంద్రాల వద్దకు రాకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తోంది.

పరీక్షలు ముగిసే వరకు ప్రతిరోజూ ఇదే తరహా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post