ఐదు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్.



 ఐదు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల పట్టణంలోని స్థానిక సుందరయ్య కాలనీలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పెద్ద దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య తన సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఐదు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వెంకట రమణయ్య మాట్లాడుతూ, దోర్నాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post