నిరుపేదల హక్కు జకాత్ (విధి ధానం).
కంభం చిన్న మసీదు వారి ఆధ్వర్యంలో 200 మంది పేద ముస్లిం కుటుంబాలకు చేయూత.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ సందర్భం గా రంజాన్ మాసంలో సమాజంలో పేదరికం వలన ఎవ్వరు పండుగ సంతోషాన్ని కోల్పోరాదు అన్న మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాన్ని ఆదర్శంగా తీసుకొని గత 14 సంవత్సరాలుగా కంభం చిన్న మసీదు వారి ఆధ్వర్యంలో నిరాటంకముగా సాగుతోంది నిరుపేదలకు ఉచిత జకాత్ కిట్ల పంపిణీ.
స్థానిక చిన్న మసీదు వారు దాదాపు 2,40,000 రూపాయల జకాత్ నిధుల తో 200 మంది పేదవారికి రమజాన్ పండుగ నేపథ్యంలో 19 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను తయారు చేసి పంచడం జరిగింది.
నేల మీద ఉన్న వారిపై దయ చూపితే, ఆకాశంలోని వారు తమపై కరుణ చూపుతాడు అన్న దివ్య ఖురాన్ సూక్తిని అనుసరించి ప్రతి యేటా తాము నిర్వహించే ఈ కార్యక్రమం తమకు ఎంతో ఆత్మ సంతృప్తిని కలుగజేస్తుంది అని మసీదు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న మసీదు అధ్యక్షుడు డిష్ మున్నా,మహబూబ్ బేగ్, హఫీజ్ హంజా, మౌలానా ఆదిల్,అత్తార్ షేక్ హుస్సేన్(దాదా), బాజీద్ బాషా,మహబూబ్ ఖాన్,, షాకీర్,రఫీ మరి కొంత మంది ముస్లిం యువకులు తదితరులు పాల్గొన్నారు.

