ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన మార్కాపురం జిల్లా పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కృష్ణా జిల్లాకు చెందిన యల్. గౌతమ్ (29 సం.) అనే వ్యక్తి గత మూడు నెలలుగా కంభంలో నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల తేది: 06.03.2026 రాత్రి సుమారు 21.47 గంటలకు తాను చనిపోతున్నానని తన స్నేహితుడికి “Miss you” అని మెసేజ్ పంపించాడు. అనుమానం వచ్చిన అతని స్నేహితులు వెంటనే 112 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని కంట్రోల్ రూమ్ సిబ్బంది కంభం పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ.శివకృష్ణ రెడ్డి గారికి తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పై అధికారులకు తెలియపరచి, ఐటీ కోర్ టీం సహాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గౌతమ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే కంభం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని అతని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన కంభం పోలీస్ స్టేషన్ ఎస్సై, కంట్రోల్ రూమ్ మరియు ఐటి కోర్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. అభినందించారు.
