కసినపల్లెలో 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి.





 కసినపల్లెలో 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్థానిక గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు. అశోక్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ కోసం సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామన్నారు,రూ.650 కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనుల ద్వారా ఫీడర్ లెవల్ బైఫరకేషన్ ను చేపట్టామన్నారు, జిల్లాలో ఇప్పటికే 65 శాతం ఆర్టీఎస్ఎస్ పనులు పూర్తి చేశామని అన్నారు, ఆగస్టు నాటికి జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ట్రూ డౌన్ అమలు చేస్తు ఒక్క రూపాయి విద్యుత్ చార్జీ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తు నామని తెలిపారు,బయో గ్యాస్, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పారిశ్రామికంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post