బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వీరుడు ఉయ్యాలవాడ.


 బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వీరుడు ఉయ్యాలవాడ.

చిత్రపటానికి పూలమాలలు అర్పించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, ఫిబ్రవరి :22

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, బ్రిటిష్ పాలనపై సింహ స్వప్నమై నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 175వ వర్ధంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటనారాయణ ఉయ్యాలవాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ మాట్లాడుతూ, రాయలసీమ గడ్డపై పరాయి పాలనను ఎదిరించి, తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన ధీశాలి నరసింహారెడ్డి ఆని కొనియాడారు.

సైనిక బలం తక్కువగా ఉన్నా, కేవలం ప్రజా మద్దతుతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించిన ఘనత ఆయనది అని పేర్కొన్నారు.

నేటి తరానికి ఆయన పోరాట పటిమ, దేశభక్తి ఎంతో ఆదర్శప్రాయమని తెలిపారు.

స్వాతంత్య్ర యోధుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛ అని, వారి ఆశయాలకు అనుగుణంగా పోలీసులు అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని నరసింహారెడ్డి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post