అజిత్ మృతి పై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటా కలెక్టర్ వెట్రిసెల్వి హామీ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, ఫిబ్రవరి, 7 : పెదవేగిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న అజిత్ మరణంపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలనీ అజిత్ తల్లితండ్రులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లో శనివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని అజిత్ తల్లితండ్రులు కలిసి తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, తమ కుమారుడి మృతిపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. అజిత్ మృతి విషయంపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని అజిత్ తల్లితండ్రులకు కలెక్టర్ వెట్రిసెల్వి హామీ ఇచ్చారు.
