ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మరియు డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు వివిధ రకాల హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీ మరియు స్వీట్ షాప్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖి లో మొత్తం పది బృందాలు గా విడిపోయి హోటల్ నిర్వాకులు నిల్వ ఉంచిన మాంసాహారం మరియు ముందు రోజు వండిన ఆహారం ఫ్రిజ్జుల నిల్వ ఉంచడం గుర్తించారు అలాగే కాలం చెల్లిని ఆహార పదార్ధములు గుర్తించడం జరిగింది,వాటిని చీజ్ చేసి కేసు నమోదు చేయడమైందని తెలిపారు.
అదేవిధంగా స్వీట్ షాప్ ల నందు మరియు బేకరీ షాప్ లలో కూడా కాలం చెల్లిన ఆహార పదార్థములు గుర్తించటం జరిగింది
తయారుచేసిన మరియు నిర్ణీత గడువు తేదీలు లేకుండా ప్యాకేజ్ చేసిన ఆహారం విక్రయించుటం జరిగిందన్నారు.
ఈ తనిఖీల మొత్తం 20 శాంపిన సేకరించి పరీక్ష నిమిత్తము ఆహార లేబరేటరీ కి పంపించడం జరిగిందని సదర్ నివేదిక వచ్చిన పిదప నిర్వ కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు.
అలాగే నిర్వాహకులకు ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేయడం జరిగిందని మరియు ఎక్స్ప్రే స్టాక్ మరియు స్టీల్ ఫుడ్ నిల్వ ఆహారంను గుర్తించడము జరిగింది.
నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి నివేదించరని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఇకపై వ్యాపారులు తాము స్టోర్ రూములు నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని ఏ విధమైన గడువుతిరిన ఆహార పదార్థాలు తయారు కేంద్రాల్లో లేకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించడమైందనితెలిపారు,
మరియు నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి వ్యాపారసంస్థలు.నిపుణులైన పేస్ట్ కంట్రోల్ నిర్వాహకులచే పేస్ట్ కంట్రోల్ చేయించుకోవాల్సిందిగా వ్యాపారనిర్వాహకులనుహేచ్చరించారు.
ఈ తనిఖీలో లీగల్ మెట్రాలాజి అధికారులు. 20 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ తనిఖీలో వివిధ జిల్లా లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మరియు డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్.కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం ఈ తనిఖీలో పాల్గొన్నారు.
