గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
శనివారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లో డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరంనకు సంబంధించి 5వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం పై రూపొందించిన గోడ పత్రికలను ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్.పి.రాజాబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జయ పాల్గొన్నారు.
