మీ స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా.


 మీ స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

దేవుడితో ఆటలాడితే వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు

గత ఐదేళ్ల వైసిపి పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలు కోకొల్లలు

చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పకపోగా సిగ్గులేకుండా హెరిటేజ్ పై బురద చల్లుతారా...మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి,వైసీపీ నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం సిగ్గు చేటు, దేవుడితో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా, బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఆదివారం ఒంగోలులో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్ధన్ తో కలసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.వైసీపీ హయాంలో జగన్ తన సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. గత 5 ఏళ్లు టీటీడీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వైవీ సుబ్బారెడ్డి లడ్డులో కల్తీ జరిగింది వాస్తవమేనని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కల్తీ జరగలేదని బుకాయిస్తున్నారు.

 అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన తిరుమల ప్రసాదం లడ్డూలలో నెయ్యేలేదు. సిట్ లో ఏమీ లేదని మాట్లాడుతున్నారు, దేవుడి మీద జగన్ కు, వైసీపీ నేతలకు విశ్వాసం లేదు. శాసనమండలిలో చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం తేవడం పద్ధతి కాదు. ఇది రూలింగ్ కాదని సభ వాయిదా వేసి వెళ్లినప్పటికి వైసీపీ సభ్యులు గొడవ సృష్టించారు.వైసీపీ సభ్యులు సభకు వచ్చినప్పుడు చెప్పులేసుకుని వెంకటేశ్వరస్వామి పటం చేతుల్లో పట్టుకొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు ఇది ఎంతవరకు సమంజసం? సభకు ఫోటోలు తీసుకురావడం క్షమించరాని నేరం. బయటకు వెళ్తూ బల్లల మీద వెంకటేశ్వరస్వామి పటాలను విసిరేసి వెళ్లారు. వైసీపీ నాయకులకు, జగన్ కు దేవుడి మీద నమ్మకం లేదు. హిందూ ధర్మం మీద, విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవుడి మీద నమ్మకం లేదు.వెంకటేశ్వరస్వామి పటాన్ని ప్లకార్డుల్లాగా చూశారే గాని వెంకటేశ్వర స్వామిలాగ చూడలేదు.బొత్స సత్యనారాయణ తమ సభ్యులు ఎవరు చెప్పులేసుకువెళ్లలేదు, చెప్పులు వదిలి వెళ్లారని అంటున్నారు. 

సభలో చెప్పులేసుకొని వెళ్లినట్లు వీడియో క్లిప్పింగ్స్ ద్వారా తెలుస్తోంది. కానీ బొత్స సత్యనారాయణ చెప్పులేసుకొని వెళ్లలేదని బుకాయించడం సిగ్గుచేటు. దేవునితో పెట్టుకున్నారు 11 అయిపోయారు,  నాడు రామతీర్థంలో రాముడి తల నరికారు చంద్రబాబు వెళ్తుంటే వెళ్లనివ్వలేదు. వైసీపీ వ్యహరశైలి ప్రజలు గమనిస్తున్నారు. జగన్ చెప్పిన డైరెక్షన్ లో దేవుడితో రాజకీయాలు చేస్తే దానికి తగిన అనుభవిస్తారు.తిరుమలలో గోవింద నామ స్మరణ తప్ప వేరేది చేయకూడదు,  వై.వి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్న సమయంలో జగన్ పిన్నమ్మ జగన్ రక్షక గోవిందా అని చెప్పారు అది గోవింద నామంలో లేదు, గోవింద నామాలలో లేని దాన్ని పలుకొచ్చా? సుబ్బారెడ్డి, పి ఎ,చిన్న అప్పన్న అకౌంట్ లోకి నాలుగు కోట్ల 69 లక్షలు ఎలా వచ్చాయి? నాకు సంబంధం లేదని ఎలా చెప్తారు ? చేసిన అక్రమాలన్నీ చేసి సిగ్గు లేకుండా హెరిటేజ్ మీద బురద చల్లుతున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post