బాలికల వసతి గృహాన్ని అకస్మిక తనిఖీ.



 బాలికల వసతి గృహాన్ని అకస్మిక తనిఖీ.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

    ప్రకాశం జిల్లా ఒంగోలు లో జేడి పరివర్తన భవనంలోని ప్రభుత్వ సాంఘిక కళాశాల బాలికల వసతి గృహం 2,3 లను మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు గురించి ఆరా తీశారు. 

ఈ సందర్భంగా వంట గదిని, తాగునీటి వసతులను, మరుగుదొడ్లను, పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా , ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, వారి ఆరోగ్య పరిస్థితులు, కల్పిస్తున్న వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. 

విద్యార్థులు మాకు వసతులు బాగున్నాయని, ప్రతినెలా వైద్యులు వచ్చి పరీక్షలు చేసి వెళతారని డి ఆర్ ఓ కు విద్యార్థినిలు తెలియజేయడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి విద్యార్థులతో కలసి భోజనం చేయడం జరిగింది విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి ఆయన సూచించారు.

   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్. పి రాజాబాబు ఆదేశాల మేరకు ఈ రోజు బాలికల వసతి గృహం పరిశీలించడం జరిగిందన్నారు. వసతులు, భోజనం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనాయక్ హాస్టల్ వార్డెన్ లు శిరీష, శ్రీలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post