ఐ వి ఆర్ ఎస్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్.



 ఐ వి ఆర్ ఎస్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులకు సంబంధించి సమస్య పరిష్కారం అయిన తరవాత పరిష్కార విధానం, దరఖాస్తుదారుల సంతృప్తి చెందారా.. లేదా అన్న విషయాన్నీ ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుసుకుని అందుకనుగుణంగా పనిచేసినప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. గోపాలక్రిష్ణ పేర్కొన్నారు. 

గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలక్రిష్ణ ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా పలువురు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక దరఖాస్తుదారులకు స్వయంగా ఫోన్ చేసి సమస్య పరిష్కార విధానం, సంతృప్తి చెందారా.. లేదా అన్న విషయాన్నీ తెలుసుకోవడం జరిగింది. అలాగే సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఏ విధంగా సమస్యను పరిష్కరించారన్న వివరాలను అడిగితెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయడంతో పాటు సంబంధిత ధరకాస్తుదారులు సంతృప్తి చెందారా లేదా ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ విధానం అమలు వలన ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి.చిన ఓబులేసు, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post