ఐ ఎ ఎస్ లా! అదానికి ఎజెంట్లా!.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:01.దేవరపల్లి::
ఐ ఎ ఎస్ లు చదువు కుని అదాని నవయుగ కంపెనీలకు ఎజెంట్లుగా వ్యహరించడం ఆది వాసీలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టాలని చూడటం అత్యంత దుర్మార్గపు చర్యని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు శనివారం అయిన ఓ ప్రకటన విడుదల చేసారు గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లు ఒప్పందాలకు సంబంధించిన జిఒ నెంబర్లు 2, 13, 51 లను రద్దు చేయాలని గత కొంత కాలంగా పోరాడుతున్న ఆదివాసీలకు అవ గాహన లేక పోవడంతో ఉద్యమాలు చేస్తున్నారని ప్రాజెక్టులు వల్ల ఆదివాసిలకు గిరిజనులకు నష్టం జరగదని 4,500 మందికి పత్యేక్షంగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలుగు తాయని కంపెనీ ద్వారా నష్ట పోయిన వారికి అంగన్వాడీ బిల్డింగ్ లు కమ్యూనిటీ హల్స్ రోడ్లు,ఇల్లులు పోయిన వారికి పున రావాసం క్రింద 8 లక్షలు వరకు పరిహారం ఇస్తారని అదాని నవయుగ కంపెనీలు ఎజెంటు లాగ! అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడటం హస్య స్పదంగా ఉందన్నారు ఎక్కడైనా ఐఎఎస్ హోదాలో ఉన్న కలెక్టర్లు ప్రజలు మనోభావాలను అర్దం చేసుకుని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక పంపించి మెజార్టీ ప్రజలకు న్యాయం చేయాలని చూడాలి తప్ప జీవ నోపాధి కోసం తమ మనుగడ కోసం ఉద్య మాలు చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు అవ గాహన లెదని అర్థం చేసు కోవడం లేదని అబద్దపు మాటలతో గిరిజనులకు మాయమాటలు చేప్పి కంపినీలకు అనుకూలంగా ఒప్పించడం కోసం పూనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు అనిచి వేత ఎక్కడ ఉంటే తిరుగు బాటు అక్కడ ఉంటుందని ఆదివాసీలకు ఉద్యమాలు కోత్తెమి కాదని కలెక్టర్ గారు గుర్తించాలని పేర్కొన్నారు,హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల ఆదివాసీ గ్రామాలు, భూములు,అడవులు పర్యవరణం సహజ వనరులు నష్ట పోవని కలెక్టర్ గారే గిరిజనులు ఉద్య మాన్ని తప్పు దోవ పట్టించె విధంగా ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గ మన్నారు,దీన్ని ప్రజాస్వామ్య వాదు ప్రజాసం ఘాలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ఖండించాలని కోరారు
పెదకోట రైవాడ కు విద్యుత్ ఉత్పత్తి పెంచు కోవ డానికి ఇచ్చిన జీవో నెంబరు 51 రైవాడ ప్రాజెక్టుకు పూర్తిగా క్యాచ్ మెంట్ ఎరియాలో ఉందని ఈ జివో వల్ల వేలాది ఎకారాలు పంట భూములు లక్ష లాది మంది విశాఖ త్రాగు నీటి అవసారాలకు నష్టం వస్తుందని కలెక్టర్ కు తెలుసా! అని ప్రశ్నించారు? చిట్టం వలస,గుజ్జెలి వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో నాలుగు మండలాల పరిధిలోని 15 పంచాయతీల్లో 145 ఆది వాసీ గ్రామాలు జల సమాధి అవుతాయని,గిరిజనులు అందోన చేందుతున్నారని తెలిపారు, వేలాది ఎకారాలకు సాగునీరు లక్షలాది మందికి త్రాగునీరు అందిస్తున్న రైవాడ క్యాచ్ మెంట్ ఎరియాలో హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇస్తారని రైతులు అందోన చేందు తుంటే ఈప్రాజెక్టులతో ఉపాధి వస్తుందని ఉద్యోగాలు వస్తాయని నమ్మించాలని చూడటం దారుణ మన్నారు,కలెక్టర్ గిరిజన చట్టాలకు గిరిజనులకు రక్షకునిగా ఉండాలి తప్ప నవయుగ, అదాని ప్రైవేటు సంస్థలకు సేవకునిగా ఉండ రాదని ఆదివాసీలను గిరిజనుల ను ఒప్పించే కంటే అదాని నవయుగ కంపెనీలు యాజ మాన్యంను ఒప్పించి గిరిజనుకు నష్టం కలుగకుండా వెనుకకు పంపాలని చూస్తే కలెక్టర్కి గౌరవం దక్కుందని తెలిపారు గిరిజనులు మనో భావాలను అర్దం చేసు కోని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి వివ రించాలని తక్షణమే ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇచ్చిన జిఒలతో పాటు పెదకోట రైవాడ క్యాచ్ మెంట్ ఎరియాలో ఇచ్చిన జివో నెంబరు 51 ని తక్షణమే రద్దు చేయాలని వెంకన్న డిమాండ్ చేసారు.
