ఈ వెలుగుల పండగ చాలా సంతోషంగా జరుపుకోవాలని డి ఆర్ ఓ,
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
దీపావళి సందర్భంగా ఒంగోలు నగరంలోని పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయశాలలను జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ.బి.చిన ఓబులేసు ఆదివారం సందర్శించారు. విక్రయాలు జరుగుతున్న తీరు, ధరలు, ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు, అవాంఛనీయ ఘటనలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు విపత్తుల నిర్వహణ శాఖ సన్నద్ధత, తదితర అంశాలను ఆయన పరిశీలించారు. బాణసంచా కొనుగోలుదారులతోనూ డీఆర్వో మాట్లాడారు. ఈ వెలుగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చే సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంట మునిసిపల్ అధికారులు కూడా ఉన్నారు.
Add

