కంభం చెరువును పరిశీలించిన మార్కాపురం ఆర్డీవో.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని ఆసియా ఖండంలో రెండవ గొప్ప చరిత్ర గల కంభం చెరువును సందర్శించిన మార్కాపురం ఆర్ డి ఓ. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్ష ప్రభావంతో కంభం చెరువుకు. జంపలేరు గుండ్లకమ్మ నల్లవాగు నుండి వస్తున్న వరదనీటి ప్రవాహంతో కంభం చెరువుకు నీరు చేరుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో ఏమైనా చెరువుకు సంబంధించిన సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. అలాగే మండలంలోని సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తాసిల్దార్ వి కిరణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను పంచాయతీ అధికారులతో పారిశుద్ధ కార్మికుల చేత నీటి నిల్వ లేకుండా చేయాలని అన్నారు.
వాగులు చెక్ డ్యాముల దగ్గర గుండల దగ్గరకు ప్రజలను వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ కిరణ్ కుమార్. ఎంపీడీవో వీరభద్రాచారి. వివిధ శాఖల అధికారులు ఆర్డిఓ వెంట ఉన్నారు.
Add

