సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే:






సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: 

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )

గిద్దలూరు పట్టణంలోని 17,  18వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణి చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

సంక్షోభంలోనూ ప్రజలకు, సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ప్రతి నెలా ఒకటవ తేదీనే నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని నల్లబండబజారు, 17, 18 వార్డులలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి  ఇంటింటికీ తిరిగి, లబ్దిదారులకు పింఛన్లు అందించారు. గత 5 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని, రూ.1000/- పెంచేందుకు జగన్ రెడ్డికి నాలుగేళ్లు పట్టిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రూ.1000/- పెంచిన ఘనత చంద్రబాబు దేనని, ప్రతి నెల 1వ తేదీనే  వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ. 15 వేలు పంపిణీ చేస్తూ దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతి పెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్  నిలిచిందన్నారు. ఇది పేదల ప్రభుత్వం, పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్నారు..

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య,  మున్సిపల్ కమిషనర్  ఈ.వి రమణ బాబు, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post