శాంతియుత వాతావరణంలో పండుగ చేసుకుందాం : మార్కాపురం డీఎస్పీ.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు కంభం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు. కంభం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు మండల కేంద్రంలోని వివిధ ప్రజా సంఘ నాయకులు కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.
మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలె ఒకే కుటుంబం లో ఉన్నామని దసరా ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు సందర్భములో మసీదు దగ్గర గాని చర్చిల దగ్గర గాని ఎక్కువసేపు డిజె సౌండ్ పెట్టకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకుందామని అన్నారు.
3వ తేదీన దసరా ఉత్సవాల్లో భాగంగా కంభం పట్టణములో శ్రీ వాసవి కన్యాకపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపును ప్రశాంతంగా జరుపుకుందామన్నారు. అలాగే గత సంవత్సరం లాగే అవాంచనియ సంఘటనలు జరగకుండా భారీ భద్రత కల్పిస్తున్నామని చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల వలె అందరమూ కలిసి ఉత్సాహ ఊరేగింపులో పాల్గొందామని అన్నారు.
ముస్లిం మైనార్టీ నాయకులు మాజీ సర్పంచి స్టార్ భాష మాట్లాడుతూ దసరా పండుగ విశిష్టతను ఆయన తెలియజేశారు.
అలాగే క్రైస్తవ ఏ బి ఎం సంఘ నాయకులు కాకర్ల ప్రసాద్ మాట్లాడుతూ.శాంతి కమిటీ సమావేశానికి మా క్రైస్తవల సంఘ నాయకులకు కమిటీ వారు తెలియపర్చాలని అలాగే చర్చిల దగ్గర ప్రార్థన సమయాలలో సమయపాలన పాటించాలని ఉత్సవ కమిటీ వారిని మరియు పోలీస్ అధికారులను ఆయన కోరారు.
ఈ శాంతి కమిటీ సమావేశంలో కూటమి నాయకులు. కేతం శీను. ఓ మాధవ్. తోట శ్రీనివాస్. ఎస్సీ సెల్ నాయకులు. సిరివెళ్ల రవి. జనసేన నాయకులు. తాటిశెట్టి ప్రసాద్.వివిధ ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

