ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ముత్తుముల.


 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో శాసనసభ్యులు   ముత్తుముల అశోక్ రెడ్డి  మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటిచెప్పారు.

ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఒక్కొక్కరు ఒక మొక్క నాటి, దానిని పెంచితేనే హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధ్యమవుతుంది” అని ఎమ్మెల్యే  తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post