అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా చెరువు కట్టను సందర్శించిన జాయింట్ కలెక్టర్ మరియు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం శ్రీకృష్ణదేవరాయ సతీమణి వరదరాజమ్మ కట్టించిన చెరువు కట్ట పై యోగాంధ్ర ఏర్పాట్లను మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి జిల్లా యంత్రాంగం పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంభం చెరువు కట్ట ను ఈ నెల 9 తారీకున ప్రధాన వేదికగా ఎంపిక చేసిన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా పాల్గొననున్న యోగా సాధకులకు అవసరమైన వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ ,ఎమ్మెల్యే , ఆర్ డి ఒ గార్లకు కంబం మండల నాయకులు, స్థానిక నాయకులు శాలువాలతో సన్మానించారు.

