అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికిఅందరూహాజరుకావాలి ఎం ఈ ఓ 1 అబ్దుల్ సత్తార్.


 అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికిఅందరూహాజరుకావాలి ఎం ఈ ఓ 1 అబ్దుల్ సత్తార్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం:ఈనెల 9న  కంభం చెరువు కట్టపై నిర్వహించే యోగా డే కార్యక్రమంలో మండలంలోని ఉపాద్యాయులు, విద్యావేత్తలు,విద్యార్థులు, తల్లిదండ్రులు,పౌరులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కంభం మండలం ఎంఈవో అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుండి యోగా డే కార్యక్రమాలు ప్రారంభమవుతాయనీ, అనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయనీ,

ఈ కార్యక్రమానికి  గిద్దలూరు శాసనసభ్యులు  అశోక్ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత , జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు,పలువురు ఉన్నతాధికారులు  హాజరుకానున్నారని చెప్పారు.

విద్యా శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా  ఎం ఈ ఓ 1 అబ్దుల్ సత్తార్  కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post