మొగిలిపాడులో రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
పలాస, జూన్ 20: రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయాన్ని మరింత లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ వజ్జ బాబూరావు పేర్కొన్నారు.
పలాస పురపాలక సంఘం పరిధిలోని మొగిలిపాడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ఆదేశాల మేరకు నిర్వహించిన రైతులకు రాయితీ ధరలపై విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు రైతులకు సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
రైతులు ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయ విధానాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ అధిక లాభాలు పొందేలా ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తోందన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

