పలాస రైల్వే స్టేషన్ పరిధిలో రైలులో ప్రయాణికుడి మృతి.


 పలాస రైల్వే స్టేషన్ పరిధిలో రైలులో ప్రయాణికుడి మృతి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 20: 

పలాస రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గుణుపూర్–కటక్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మృతుడు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన ఎరుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ (Government Railway Police) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పలాస జీఆర్పీ రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం 94922 50069 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post