కంభం: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన యువతి.


 కంభం: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన యువతి.

మార్కాపురం...జిల్లా.. కంభం SPG పాలెం కు చెందిన *అంబటిపూడి* *జిషిత* గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా శుక్రవారం ప్రతిభావంతుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

2026 ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్నారు. అందులో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

ఎంపికైన ప్రతిభావంతులకు హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో స్వయంగా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో కంభం పట్టణం, ఎస్‌పిజి పాలెంకు చెందిన అంబటిపూడి బాబు, సుజాత దంపతుల కుమార్తె అంబటిపూడి జిషిత పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

సంగీత రంగంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈమె ఒంగోలులో నేత్ర వైద్యం చదువుతుంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post