పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల పట్టణంలో రాములవారి వీధి నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు.
శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నెలలో ఒకటో తారీకు ని ఖచ్చితంగా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని నేడు రాచర్ల పంచాయతీ లో మొత్తం 627 పెన్షన్ లకు 28,12,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
గతప్రభుత్వంలోఉపాధ్యాయులకుకానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ నెలకు జీతము సరిగా ఇచ్చే వారు కాదని కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి మరియు పెన్షన్ దారులకు ఒకటవ తారీకు ఉదయాన్నే వారి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఇది కూటమి ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ శ్రద్ధ అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిద్దలూరు నియోజకవర్గానికి 38,454 పింఛన్లకు గాను 17 , 21, 55 ,000 వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరానికి 33 ,000 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పెన్షన్ ఇవ్వడం జరగడం లేదని ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్క పేద ప్రజలకి అందించడం జరిగిందని గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని కానీ నేడు కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ అధిగమించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారని అభివృద్ధిలో ముందుకు పోతుందని తెలిపారు.
కార్యక్రమంలో రాచర్ల మండల రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, మరియు మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్ , ప్రధాన కార్యదర్శి యాసం లక్ష్మి రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి, శివారెడ్డి , సిరిగిరి వేంకటపతి, భూపని కాశయ్య , దప్పిలి కాసిరెడ్డి, ముత్తుముల శేఖర్ రెడ్డి, పార్లమెంట్ ట్రెజరర్ అంబవరం శ్రీనివాస్ రెడ్డి, భవనం పుల్లారెడ్డి, నల్లబోతుల సంజయ్, తలపాటి దివాకర్, శ్రీను, కత్తి అన్నాజీరావ్, గుర్రం దానియేలు, పాపిశెట్టి శ్రీనివాసులు, ఆది నారాయణ రెడ్డి,కళ్యాణ రెడ్డి ,M.V సాయి, సయ్యద్ మియా,స్థానిక వార్డు నాయకులు తదితరులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

