ఒంగోలు పారిశ్రామికవేత్తలతో గెట్ టుగెదర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్.



 ఒంగోలు పారిశ్రామికవేత్తలతో గెట్ టుగెదర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

అనంతరం పెట్టుబడిదారులతో సదస్సు జిల్లాకు పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు డీ.ఐ.ఈ.పీ.సీ. సమావేశంలో నిర్ణయం

అర్హులకు రూ.29.17 కోట్లు మంజూరు

జిల్లాకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కలెక్టర్ .పి.రాజాబాబు చర్యలు వేగవంతం చేశారు. త్వరలోనే పెట్టుబడిదారులతో ప్రత్యేక సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ముందుగా పారిశ్రామికవేత్తలతో గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి పెట్టుబడులు, ఎగుమతుల 

ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో ఆయన పునరుద్ఘాటించారు. మైక్రో ఫైనాన్సుతో మైక్రో బిజినెస్ చేసేలా స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన ప్రోత్సాహం, ఆర్థిక సహాయం వేగంగా అందేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. రుణాల మంజూరులో జాప్యం ఉండకూడదని అన్నారు. ఈ దిశగా డిఆర్డిఏ, మెప్మా, 

బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వారి ఉత్పత్తులకు ముందుగా స్థానిక క్లస్టర్ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలన్నారు. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, రాయితీలను వారికి వివరించాలని ఆదేశించారు. ఈ దిశగా ముందుకు వచ్చిన ఔత్సాహికుల దరఖాస్తులను సత్వరం క్లియర్ చేయాలన్నారు. కాగా, 120 క్లెయిమ్‌లకు ప్రభుత్వం తరఫున రూ. 29.17 కోట్లు ఆర్థిక ప్రోత్సాహకాన్ని ఈ సందర్భంగా మంజూరు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, డి.ఆర్.డి.ఏ. పి.డి. నారాయణ, మెప్మా పిడి విజయలక్ష్మి, ఎల్ డి ఎ రమేష్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, నాబార్డ్ డీ.డీ.ఎం. రవికుమార్, ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక

పారిశ్రామికవేత్తలు, ఫ్యాప్సీయా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సుబ్బారావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఉచితంగా డీ.పీ.ఆర్.

 ఔత్సాహి పారిశ్రామికవేత్తలకు సహాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని ఫిన్వాయిస్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ ఫర్వేజ్ మహమ్మద్ తెలిపారు. తమ సేవలను వినియోగించుకునేందుకు ఎంప్యానల్ద్ జాబితాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేర్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు తమ సంస్థ తరఫున తయారుచేసిన డి.పీ.ఆర్.ల వివరాలను ఈ సమావేశంలో కలెక్టరుకు ఆయన వివరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post